- Advertisement -
రూ. 1 లక్షా 12 వేల ఒక్క రూపాయికి దక్కించుకున్న రామవతు మదన్మోహన్ శైలజ దంపతులు
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని మేషరాజుపల్లి గ్రామ శివారులోని పీజీ తండాలో బాలాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉతవాలు నిర్వహించిన లడ్డు వేలం పాటలో రూ. 1 లక్ష 12 వేల ఒక రూపాయికి రామవాతు మదన్మోహన్ శైలజ దంపతుల దక్కించుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ నాయక్ మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనంలో భాగంగా లడ్డూ వేలంపాటను నిర్వహించామనీ, ఇందులో భాగంగా రామావత్ మదన్మోహన్ శైలజ దంపతులు రూ.1,12,001/- దక్కించుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు తండ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



