సినిమా రంగంలో రాణించాలనే తపనతో యువత ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అందులో విజయం సాధించడం మాత్రం అంత సులభం కాదు. కొందరు యువకులు తమకున్న సజనాత్మకతతో లఘు చిత్రాలు రూపొందిస్తూ సినిమా రంగంలో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు.
సూర్యాపేట జిల్లాకు చెందిన సుధాకర్ కు చిన్నప్పటి నుంచే ఫొటోగ్రఫీ అంటే మక్కువ. తండ్రి కొనిచ్చిన చిన్న కెమెరాతో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఫొటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్నారు. ఆ తరువాత సెల్ ఫోన్లు వచ్చాయి. వాటితో అత్యుత్తమ నాణ్యత కలిగిన కెమెరాలు రావడంతో ఫోన్ లో కూడా చిత్రీకరణ చేసి భళా అనిపించుకున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ వేవ్ బాగా నడుస్తుండటంతో ఫొటోగ్రఫీని ఉపాధిగా మార్చుకున్నాడు సుధాకర్ అక్కినపల్లి. తన జర్నీ విశేషాలు నవతెలంగాణ జోష్ తో పంచుకున్నారు.
చిన్నప్పటి నుంచే సినిమాల పట్ల ఆసక్తి ఉండేది. స్కూల్ రోజుల్లో నేనే వీడియోలు తీసేవాణ్ణి. మా స్కూల్లో ఎక్స్కర్షన్ కి తీసుకు వెళ్లినప్పుడు నేను ఒక చిన్న కెమెరా తీసుకొని వెళ్లాను అప్పుడు అందరిలాగా నేను అక్కడ ఆడుకోకుండా ఆ ఎక్స్ప్రెషన్ లో జరిగేవన్నీ షూట్ చేసే వాడిని, ఆ ఆసక్తే తరువాత ప్రొఫెషన్‌గా మారింది. కెమెరా నా జీవితంలో ప్రధాన భాగమైపోయింది. నా మొదటి ప్రాజెక్ట్ ఒక షార్ట్ ఫిల్మే. అది 2012లో జరిగింది. మంచి ఫ్రెండ్ కోసం చేసినది. పెద్దగా బడ్జెట్ లేకపోయినా, ఆ ఫ్రేమ్ తీసే క్షణమే నన్ను సినిమాటోగ్రఫీ వైపు పూర్తిగా లాగేసింది. కెమెరామాన్‌గా అది మొదటి స్టెప్. ఇంటర్ లో ఉండగా సినిమాటోగ్రఫీపై ఆసక్తి పెరిగింది. దీంతో మా అన్నయ్య సహకారంతో ఓ టీవీ ఛానల్ లో రోజుకు రూ.50 జీతంతో కెమెరా అసిస్టెంట్‌గా చేరాను. కొన్నాళ్ల తర్వాత సొంతంగా ఒక కెమెరా కొనుక్కుని లఘు చిత్రాలకు పని చేయడం మొదలుపెట్టాను. మా ఊరి వంట కార్యక్రమానికి అసిస్టెంట్ గా పనిచేశాను.
ఇప్పటివరకు రహస్యం, శివ 143, మిస్టరీ 2023, సంఘర్షణ వంటి నాలుగు ఫీచర్ ఫిల్మ్స్‌లో పనిచేశాను. శివ143 షఉట్ చేసే టైంలో ఒక ఫైట్ సీక్వెల్స్‌లో కెమెరా పట్టుకొని అలా వెనుకకు వెళ్తూ కింద పడిపోయేవాడ్ని. కానీ, నా పక్కనే ఉన్న నా అసిస్టెన్స్ పట్టుకోవడంతో తటిలో పెద్ద ప్రమాదమే తప్పింది. నిజానికి అది చాలా పెద్ద లోయ. అందులో పడితే ఇక అంతే సంగతులు. అది నా జీవితంలో మర్చిపోలేని దుర్ఘటన అయితే ‘మిస్టరీ’ సినిమాలో క్లైమాక్స్ సీన్‌ని ఒక టెక్ లో సింగిల్ హ్యాండ్‌హెల్డ్ షాట్ లో తీశాం. అది నా కెరీర్‌లో బెస్ట్ మెమరబుల్ మూమెంట్. రామ్ గోపాల్ వర్మ స్ఫూర్తితో చిట్టీలు వేసే డబ్బులు జమచేసి 5డి కెమెరా కొనుకున్నాను.
278 షార్ట్ ఫిల్మ్స్
ఈ షార్ట్ ఫిల్మ్స్ నాకు బాగా నేర్పించాయి. ఫొటోగ్రఫి తిలక్ దగ్గర నేర్చుకున్నాను. ప్రతి కథ, ప్రతి డైరెక్టర్ దగ్గర నుంచి ఏదో కొత్తగా నేర్చుకున్నాను. వాళ్ల కలల్ని కెమెరాలో చూపించడం నా బాధ్యతగా భావించాను. ఇప్పటివరకు నేను దాదాపు 278 షార్ట్ ఫిల్మ్స్ కు పనిచేశాను. అలాగే 10 ఇండిపెండెంట్ సినిమాలకు, శివ 143, రహస్యం వంటి పెద్ద సినిమాలకు పూర్తిస్థాయి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాను. తెలుగులో అతి ఎక్కువ చిత్రాలకు ఛాయా గ్రాహకుడిగా పేరొచ్చింది.
నేను ఫ్యూచర్‌లో ఎన్ని పెద్ద సినిమాలు చేసినా, షార్ట్ ఫిలిం డైరెక్టర్ ఎవరైనా షార్ట్ ఫిలిమ్స్‌కి కెమెరామెన్‌గా వర్క్ చేయమని పిలిస్తే తప్పకుండా చేస్తాను. ఎందుకంటే నేను ఈ స్టేజిలో ఉండడానికి గల కారణం నా షార్ట్ ఫిలిమ్స్ కాబట్టి షార్ట్ ఫిలిం మేకర్స్ ఎప్పుడు వచ్చినా నేను చేయడానికి రెడీ, అప్పట్లో నేను తీసిన షార్ట్ ఫిలిం మేకింగ్ నా ఫ్యూచర్ కి చాలా ఉపయోగపడింది అప్పట్లో రౌండ్ ట్రాలీ ట్రాక్స్ ఉండేది కాదు సో అప్పుడు నేను ఒక బైక్ మీద నుంచొని రౌండ్ ట్రాలీ షాట్ తీశాను. ఆ మేకింగ్ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల నాకు బాగా ఫేమ్ వచ్చింది. అప్పుడు, ఇప్పుడు మీ ముందు ఉన్నాను ఇలా, ప్రతి ఒక్క షార్ట్ ఫిలిం విజువల్స్ నా ఫ్యూచర్ కి చాలా ఉపయోగపడింది. డైరెక్టర్స్ నాకు కథ చెప్పే విధానాన్ని ఫ్రేమ్‌లో చూపించాలని చూస్తాను. అందులో నాకిష్టముండే లైట్, షాడో ప్లే, నేచురల్ లైటింగ్‌తో పని చేయడం ఎక్కువగా చేస్తాను.
కెమెరా ఎక్విప్‌మెంట్
నేను షార్ట్ ఫిలిం తీసే టైంలో నా సొంతంగా కొనుక్కున్న 5డి కెమెరాతో తీసేవాడిని రోజులు మారుతున్న కొద్దికి అప్డేటెడ్ వర్షన్స్ కామెర్స్ వస్తున్న కొద్దిగ నేను మారేవాడిని, ప్రస్తుతం నేను మూవీస్ కి వాడుతున్న కెమెరాస్ Arri , RED, sony ఇవే ఎక్కువగా వాడుతుంటాను. ప్రతి కెమెరాలో ఒక ప్రత్యేకత ఉంటది. కాబట్టి ప్రతి కెమెరాని వాడేవాడిని. కొత్తగా వచ్చిన ప్రతి లెన్స్ ను ట్రై చేస్తూ ఉంటాను. కొత్తగా ఏది వచ్చినా చెక్ చేసుకోని ఉపయోగిస్తాను. నా కెమెరాస్ నాకు ఎంత ఉపయోగపడతాయో నాతో పాటు వర్క్ చేస్తున్నా నా ఫోకస్ పుల్లర్స్ గాని కెమెరా అసిస్టెన్స్ గాని చాలా ఉపయోగపడతాయి.
ప్రేరణగా నిలిచిన సినిమాటోగ్రాఫర్లు
నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి చోటా కె నాయుడు. ఆయన తీసిన 70 సినిమాలు ప్రతి సినిమా విజువల్స్ నాకు చాలా ఇష్టం. ప్రతి సినిమాలో ప్రతి ఫ్రేమ్ ను ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. నేర్చుకున్నాను. ప్రయత్నిస్తున్నాను. అప్పట్లో వచ్చిన ఈ రోజుల్లో ప్రేమ కథ చిత్రం నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్ గా ఉండేది. ఎందుకంటే అప్పట్లో ఆ సినిమా తీసిన 5డి కెమెరాతో నేను కూడా దాదాపు 278 షార్ట్ ఫిలిమ్స్ కేనన్ 5డి కామర్‌తో తీశాను. అందుకే నాకు ఆ సినిమా ఇన్స్పిరేషన్ గా ఉండేది. ఒక డిపార్ట్‌మెంట్ మిస్టేక్ జరిగితే మొత్తం ఔట్‌పుట్ మీద ప్రభావం చూపుతుంది. అందుకే నేను ప్లానింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. అలాగే సెట్‌కి టైం కి వెళ్తాను. డిజిటల్ సాంకేతికత వల్ల ఇప్పుడు లైట్ టెక్నిక్‌లు, గ్రేడింగ్ పూర్తిగా మారిపోయాయి. చిన్న బడ్జెట్‌తో కూడా సినిమాటిక్ షాట్ తీయడం ఇప్పుడు సాధ్యమే. సుకుమార్ తో కలిసి పనిచేయాలనేది నా కల. ఆయన కథల్లో విజువల్ స్కోప్ బాగా ఉంటుంది. ఓ రోజు ఆయనతో పని చేయాలని కలగంటున్నాను.
రాబోయే ప్రాజెక్ట్స్
ఒక క్రైమ్ థ్రిల్లర్ ఫ్రీ ప్రోడక్షన్‌లో ఉంది. అలాగే ఒక లవ్ జోనర్ సినిమా కూడా షఉట్ జరుగుతుంది. వెబ్ సిరీస్ కూడా ఒకటి జరుగుతుంది
వ్యక్తిగత జీవితం
కెమెరా జీవితం భాగమైపోయింది. టైం మేనేజ్‌మెంట్, ఓర్పు, సజనాత్మకత అన్నీ నేర్పింది. కానీ కుటుంబంతో సమయం గడపలేని రోజు కూడా ఉంటుంది. అది ఒకటి చాలా బాధగా ఉంటుంది. కానీ నా భార్య ప్రతిదాంట్లో నాకు సపోర్టివ్ గా ఉంటూ ప్రతిదాంట్లో ప్రోత్సహిస్తూ ఉండడం వల్లనే నేను ఈ సినీ ఫీల్డ్‌లో ముందుకు కొనసాగుతున్నాను. అందుకు నా భార్యకి ముందుగా థాంక్స్ చెప్పాలి. తర్వాత నా దగ్గర గత తొమ్మిది సంవత్సరాలుగా నాతో ఉంటూ నన్ను భరిస్తూ ఉన్న నా పర్సనల్ అసిస్టెంట్ నా తమ్ముడు శ్రీకాంత్‌కి నా స్పెషల్ థాంక్స్.
– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417