Monday, June 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం చెక్కులు అందజేత..

సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం చెక్కులు అందజేత..

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని నర్సాపూర్ గ్రామంలో పలువురు లబ్ధిదారులకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ  ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కృషితో ప్రభుత్వం మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం అందజేశారు. పలు అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రులలో వైద్యం చేయించుకున్న లబ్ధిదారులు ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు గొడిసేలా నంధితకు రూ.19వేలు, సుతారి లావణ్యకు రూ.25వేలు, మేకల సత్తేమ్మ కు రూ.25 వేలు, పోతుగంటి రాణికి రూ.44వేలు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం చెక్కులను మంజూరు చేసింది.అట్టి చెక్కులను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పొడెండ్ల సంజీవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు. ఆర్థిక సహాయం చెక్కుల మంజూరుకు కృషిచేసిన సునీల్ కుమార్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్పల్లి రాకేష్, గంగాధర్, రమేష్ గౌడ్, వెంకటేష్, ఎర్రన్న, మోహన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -