Wednesday, June 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపుణె బిజినెస్ మ్యాన్ హత్య కేసులో కీలక మలుపు

పుణె బిజినెస్ మ్యాన్ హత్య కేసులో కీలక మలుపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పుణెలో 26 ఏళ్ల వ్యాపారవేత్త కేతన్ లోయలో పడి మృతి చెందిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతని కాబోయే భార్యే హత్యకు సూత్రధారి అని పోలీసులు నిర్ధారించారు. ఈ నేరంలో ఆమె తన స్నేహితుడి సహాయం కూడా తీసుకున్నట్లు తెలిసింది. లోహగఢ్‌లో ఫోటోలు దిగేందుకు వెళ్ళిన కేతన్‌ను, హుడీ ధరించిన వ్యక్తి అనుమానాస్పదంగా వెంబడించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. 33 డిగ్రీల ఎండలో కూడా హుడీ ధరించడం, అనుమానాస్పదంగా తిరగడం పోలీసులకు అనుమానం కలిగించి, విచారణలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -