- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల్లోకి వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది. హిమాయత్ సాగర్ లోకి 400 క్యూసెక్కుల వరద చేరడంతో నీటిమట్టం పెరుగుతోంది. అవసరమైతే గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున, జలాశయాల దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాటర్ బోర్డు సూచించింది. హిమాయత్ సాగర్ నీటిమట్టం ప్రస్తుతం 1,761.15 అడుగులకు, ఉస్మాన్ సాగర్ నీటిమట్టం 1784.35 అడుగులకు చేరింది.
- Advertisement -



