- Advertisement -
నవతెలంగాణ – గండీడ్
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని లింగాయపల్లి గ్రామంలో గురువారం పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు చెస్ బోర్డులు పంపిణీ చేశారు. ఉమ్మడిజిల్లా 80 మండలాల్లో పదివేల చెస్ బోర్డులనుపంపిణీ చేసినట్లు ఎన్ఆర్ఐ ఫోరం కన్వీనర్ మహిపాల్ రెడ్డి తెలిపారు.విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రీడల్లో రాణించాలన్నారు.కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు దోమ వెంకటేష్,పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు,మాజీ సర్పంచ్ వెంకయ్య,ఉపాధ్యాయులు సంజీవరెడ్డి,సంధ్య,వీణ,విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -