Saturday, June 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అడవిలో నడవడం వల్ల మానసిక ఆరోగ్యం అద్భుతం

అడవిలో నడవడం వల్ల మానసిక ఆరోగ్యం అద్భుతం

- Advertisement -

అచ్చంపేట ఎఫ్‌డీవో చంద్రశేఖర్
నల్లమలలోని ప్రతాపరుద్రుడి కోట ట్రెక్కింగ్ చేసిన వాకర్లు 
నవతెలంగాణ-అచ్చంపేట
అడవిలో నడవడం వల్ల మానసిక ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందని అచ్చంపేట ఎఫ్డిఓ చంద్రశేఖర్ అన్నారు. శనివారం అచ్చంపేట వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు నల్లమల్లలోని ప్రతాపరుద్రుని కోట ట్రెక్కింగ్ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎఫ్ డీఓ చంద్రశేఖర్ మాట్లాడారు. విడుదల చేసే సహజ రసాయనాలు శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో దోహదపడతాయన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో శనివారం నల్లమల అటవీ ప్రాంతంలోని చారిత్రక ప్రతాపరుద్రుడి కోట వరకు ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అచ్చంపేట నుంచి ప్రత్యేక వాహనంలో మన్ననూర్ సమీపంలోని నిరంజన్ షావలి దర్గా వరకు చేరుకుని అక్కడి నుంచి ట్రెక్కింగ్‌ను ప్రారంభించారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ ట్రెక్కింగ్‌లో అటవీశాఖ అధికారులు వివిధ రకాల మొక్కలు, చెట్లు, పక్షులు, అడవిలో లభించే పండ్లు, అలాగే ప్రతాపరుద్రుడి కోట చారిత్రక విశిష్టత గురించి సభ్యులకు వివరించారు. విశాఖపట్నం, హైదరాబాద్ నగరాల నుంచి వచ్చిన పర్యాటకులు కొందరు  ట్రెక్కింగ్‌లో పాల్గొన్నారు. నిత్యజీవితంలో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రకృతి మధ్య గడపడం ఉత్తమ మార్గమన్నారు. అడవులు, కొండలు, పచ్చని వాతావరణంలో నడవడం వల్ల శరీరానికి వ్యాయామం లభించడంతో పాటు మనస్సుకు ఉల్లాసం, ప్రశాంతత కలుగుతాయని పేర్కొన్నారు. అడవుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, నల్లమల ప్రాంతంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించామని తెలిపారు.

అచ్చంపేట వాకర్స్ అసోసియేషన్ ప్రకృతి పరిరక్షణ, ఆరోగ్య చైతన్యంలో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోందని ఆయన అభినందించారు. ట్రెక్కింగ్‌లో పాల్గొన్న వాకర్స్ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉత్సాహంగా కోట శిఖరాన్ని చేరుకున్నారు.  ప్రకృతితో మమేకమై గడిపిన ఈ ట్రెక్కింగ్ ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని కలిగించిందని అచ్చంపేట వాకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు చందునాయక్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎస్‌ఆర్‌వో మహ్మద్ అబ్దుల్ సుబూర్, ఉప తహసీల్దార్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్, కోశాధికారి పోల శ్రీను, బీట్ అధికారులు ఆశ, రజిత, శోభారాణి, పార్వతి, హనుమంతు, రమేష్, వాకర్స్ సభ్యులు నిరంజన్, బషీర్, గుజ్జరి నర్సింహ, గణపతి, సాయిరాం, మాడ్య, రిటైర్డ్ తహసీల్దార్ ఎక్బాల్, రూప్ల, తాహేర్ పాషా, ప్రకాష్, లింగాచారి, రఘు, కృష్ణమాచారి, కుమార్, మల్లేష్, రాజు, ఉస్సేన్, శంకర్, తిరుపతయ్య, శ్రీనివాసాచారి, రత్నాకర్‌రావు, ఫారెస్ట్ వాచర్స్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -