మనోజ్ కుమార్, ఆశిత రెడ్డి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘నిశ్శబ్ద’. ఈ చిత్రాన్ని శ్రీ రిషి సాయి ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీనివాస్, ఎం.సంధ్యా రాణి నిర్మిస్తున్నారు. హర్రర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రమణమూర్తి తంగెళ్లపల్లి రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ లీజ్‌కు రెడీ అవుతోంది. మంగళవారం నిర్మాత శ్రీనివాస్ బర్త్‌డే సందర్భంగా చిత్ర టీజర్‌ను ఘనంగా రిలీజ్ చేశారు. అనంతరం చిత్రబృందం కేక్ కట్ చేసి ర్మాత నివాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపారు. ఈ కార్యక్రమంలో హీరోలు కష్ణ, సంజరు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హీరో మనోజ్ కుమార్ మాట్లాడుతూ, ‘ఈ మూవీలో రోగా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను. మా డైరెక్టర్ రమణమూర్తి ఇచ్చిన సజెషన్స్ వల్లే ఈ మూవీలో గా టించగలిగాను. మాది చిన్న సినిమా కాదు. మంచి స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా. హర్రర్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. ఎక్కడా అసభ్యత ఉండదు. క్లీన్ హర్రర్ వీగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది’ అని అన్నారు. ‘ఈ చిత్రంతో నేను హీరోయిన్‌గా మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమాలో నాకు ఎక్కువగా డైలాగ్స్ ఉండవు. ర్‌ఫార్మెన్స్‌తోనే ఆకట్టుకునే ప్రయత్నం చేశా. నాతో పాటు నటించిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ చాలా సపోర్ట్ చేశారు. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రమణమూర్తికి, డ్యూసర్స్ శ్రీనివాస్, సంధ్యారాణికి థ్యాంక్స్’ అని హీరోయిన్ ఆశిత రెడ్డి చెప్పారు. నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. సినిమా కూడా అంతే బాగుంటుంది. త్వరలోనే మా మూవీని థియేటర్స్‌లోకి తీసుకొస్తాం. ఇంకా నాలుగైదు ఇంట్రెస్టింగ్ మూవీస్ మా ప్రొడక్షన్ నుంచి రాబోతున్నాయి. ప్రస్తుతం ఆ చిత్రాలు వివిధ దశల నిర్మాణంలో ఉన్నాయి. వీలైనంతమంది కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చి, మంచి కంటెంట్ ఉన్న మంచి చిత్రాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాం’ అని అన్నారు. ‘డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్‌గా మా సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది’ అని నిర్మాత ఎం. సంధ్యారాణి చెప్పారు. డైరెక్టర్ రమణమూర్తి తంగెళ్లపల్లి మాట్లాడుతూ,”ప్రేమ తరంగాలు’ తరువాత నేను చేసిన చిత్రమిది. ఇప్పటివరకు వచ్చిన హర్రర్ చిత్రాలతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉంటూ ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుంది’ అని తెలిపారు.