Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు
బిఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్యాలతో కూడిన పోస్టులు చేస్తూ ప్రజలకు తప్పుడు సందేశాలు ఇస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్  డిమాండ్ చేశారు. ఈ మేరకు యాదగిరిగుట్ట ఏసీపీ మరియు ఆలేరు ఎస్‌హెచ్‌ఓలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నవతెలంగాణతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆలేరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ముందంజలో నిలపడానికి అహర్నిశలు కృషి చేస్తూ అభివృద్ధి దిశగా నిత్యం ప్రజల్లో ఉంటున్నారని అన్నారు. అలాంటి నాయకుడిపై తప్పుడు ప్రచారం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలను ప్రోత్సహిస్తున్న టిఆర్ఎస్ నాయకులు నీచ రాజకీయాలు మానుకోవాలని సూచించారు.

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బిఆర్ఎస్ (KCR-Cult 2.0) పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అయన  తీవ్రంగా ఖండించారు.ఈ కార్యక్రమంలో బైరాన్ నగర్ సర్పంచ్ కంపరాజు వెంకటేశ్వరరాజు, మండల నాయకులు కంతి నాగరాజు, వీరభద్రం రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -