Thursday, June 25, 2026
E-PAPER
Homeబీజినెస్ఎఫ్‌‌డిలపై వడ్డీ రేట్లను పెంచినబంధన్ బ్యాంక్

ఎఫ్‌‌డిలపై వడ్డీ రేట్లను పెంచినబంధన్ బ్యాంక్

- Advertisement -

హైదరాబాద్‌ : బంధన్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌‌డి)పై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ తాజా పెంపునతో 2 నుండి 3 ఏళ్ల కాలపరిమితి గల డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.95 శాతం వడ్డీ లభిస్తుండగా.. సాధారణ కస్టమర్లకు 7.45 శాతం వడ్డీ వర్తిస్తుంది. అలాగే 5 ఏళ్ల లోపు కాలపరిమితి గల డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం, ఇతరులకు 7.25 శాతం వడ్డీని బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. వీటితో పాటు రూ.5 లక్షల నుండి రూ. 10 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై 6.5 శాతం వడ్డీని అందిస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -