Monday, July 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవతెలంగాణ వరుస కథనాలపై చీతా టీం ప్రత్యేక ఫోకస్…

నవతెలంగాణ వరుస కథనాలపై చీతా టీం ప్రత్యేక ఫోకస్…

- Advertisement -

– చీతా టీం..చిరుత దాడులు
– ఎట్టకేలకు 5 కిలోల గంజాయి పట్టివేత
నవతెలంగాణ – కోటగిరి
: కోటగిరి మండలంలో విపరీతంగా గంజాయి సేవిస్తూ మైనర్ యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని గతంలో నవతెలంగాణ దిన పత్రికలో “గంజాయి మత్తులో యువత చిత్తు, ఒకటి కాదు ఐదు అడ్డాలు, అనే శీర్షికలు ప్రచురితం కావడంతో సిపి సాయి చైతన్య ఆదేశానుసారం పోలీస్ యంత్రాంగం అవగాహనా సదస్సులతో పాటు ఉమ్మడి మండలంపై ప్రత్యేకంగా పోకస్ పెట్టారు. గంజాయిపై కథనాలు రావడం పోలీసుల నిఘా ఎక్కువగా ఉండడంతో గంజాయి సరఫరా చేసే వ్యక్తులు కొద్దీ రోజులు తాత్కాలికంగా సరఫరాను నిలిపివేశారు.

అయినా ఏమాత్రం భయం లేకుండా గంజాయి అలవాటు పడిన యువత  గంజాయిని సేకరిస్తూ కోటగిరి మండలంలోని ఓ గ్రామంలో పది మందికిపైగా స్పెషల్ టీంకు దొరికినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడం  సరిహద్దు వద్ద సరైన తనిఖీలు చేయకపోవడంతో విచ్చలవిడిగా గంజాయి మహారాష్ట్ర నుండి సరఫరా చేస్తూ ధనార్జన కోసం యువత జీవితాలతో చెలగాటాలాడుతున్నారు.  ఉమ్మడి కోటగిరి మండలంలో సుమారు 50 వరకు రైస్ మిల్లు ఉండడంతో వందల మంది బీహారి కార్మికులు  ఉపాధి కోసం మిల్లలలో పని పనిచేయడం  తక్షణ మత్తు కోసం గంజాయి  సేవించడం అలవాటుగా మార్చుకోవడం  మోడ్రన్ కల్చర్ పేరిట  యువత కూడా మెల్లిమెల్లిగా బానిస కావడంతో  గంజాయి బిజినెస్  జోరుగా సాగుతుంది. గతంలో  చిన్న ప్యాకెట్ల రూపంలో సుమారు వారానికి రెండు కిలోలు చొప్పున  గంజాయి విక్రయాలు జరిగినట్లు తెలుసుంది.
 చీతా టీం… చిరుత దాడులు...
గంజాయి కల్చర్ను  అడ్డుకట్ట వేసేందుకు  పోలీసు యంత్రాంగం ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు చేపడుతున్నరు. అందులో భాగంగా శనివారం విశ్వసనీయ సమాచారం మేరకు  కోటగిరి మండల కేంద్రం చెందిన ఓ యువకుడు రుద్రూర్ మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్ బీహారి కార్మికులకు గంజాయి సరఫరా చేస్తుండగా చీతా టీం మెరుపు దాడులను నిర్వహించి ఐదు కిలోల గంజాయిని పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -