సెప్టెంబర్ 08 నుండి ప్రారంభం
నవతెలంగాణ – సంగారెడ్డి
గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న పురుషులకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా సిసిటీవీ కెమెరా ఇన్స్టాలేషన్, సర్వీసింగ్ & పుట్టగొడుగుల పెంపకంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్టేట్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి కల్పనా శిక్షణ కేంద్రం డైరెక్టర్ ఎం. రాజేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో వారు ఈ శిక్షణకు అర్హులు కారు అని తెలిపారు.
తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి 19సం,, నుండి 45 సం,, వయసు గల పురుషులు ఇందుకు అర్హులు, ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత గల సర్టిఫికెట్లు తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డ్, 4 పాస్ ఫొటోలతో సంప్రదించగలరు, సంప్రదించాల్సిన చిరునామా స్టేట్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం బైపాస్ రోడ్ సంగారెడ్డి. దరఖాస్తులను, 9704446956, 9949964097 కు వాట్సాప్ కూడా చేయవచ్చు, సెప్టెంబర్ 08 నుండి ఈ శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో వసతి, భోజనం పూర్తిగా ఉచితం. మెదక్, సంగారెడ్డి జిల్లా వాసులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పురుషులకు సిసిటీవీ కెమెరా ఇన్స్టలేషన్ సర్వీసింగ్ & పుట్టగొడుగుల పెంపకం లో నైపుణ్య శిక్షణతో పాటు వ్యాపార నిర్వహణ అభివృద్ధి, ఖాతాల నిర్వహణ సంభాషణ నైపుణ్యాలలో శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత సిసిటీవీ కెమెరా ఇన్స్టలేషన్ సర్వీసింగ్ కిట్టు అందజేస్తున్నట్లు తెలిపారు.



