Tuesday, April 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నేటి తరానికి ఉద్యమ స్ఫూర్తిని నింపిన జార్జిరెడ్డి  

నేటి తరానికి ఉద్యమ స్ఫూర్తిని నింపిన జార్జిరెడ్డి  

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌను 
నేటి తరానికి  పిడిఎస్యు స్థాపకులు, ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్  జార్జి రెడ్డి ఉద్యమ స్ఫూర్తినింపారని, పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు పంగ రవి అన్నారు. ఆలేరు పట్టణంలో మంగళవారం  సిపిఐ(ఎంఎల్)ఎన్డీఆర్ కార్యాలయంలో జార్జి రెడ్డి 54వ వర్ధంతి సందర్భం పురస్కరించుకొని పంగా అంజయ్య   చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉస్మానియ యూనివర్సిటీలో పిజి చదువుతున్న కాలంలో మతోన్మాదులు చేస్తున్న గుండాయి జానికి వ్యతిరేకంగా కామ్రేడ్ జార్జిరెడ్డి దృఢంగా నిలబడి క్యాంపస్ ను చైతన్యపరిచాడని తెలిపారు.

కామ్రేడ్ జార్జిరెడ్డిని భౌతికంగా నిర్మూలించారే తప్ప ఆయన ఉద్యమ స్ఫూర్తిని, ఆయన ధైర్య సాహసాలను, విద్యార్థుల్లో ఆయనపై ఉన్న అభిప్రాయాన్ని రూపుమాపలేకపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎఫ్ యు జిల్లా నాయకులు పి సునీల్, జీ విద్యాసాగర్,ఏ రమేష్ మాజీ పిడిఎస్ యు నాయకులు ఎం గణేష్, పి సాయిలు,జి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -