- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు తీపి కబురు చెప్పింది. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న కరవు భత్యం (డీఏ) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశమయ్యారు. ఉద్యోగుల డిమాండ్లపై చర్చించిన అనంతరం రెండు డీఏలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ప్రభుత్వం ఆమోదించిన రెండు డీఏల్లో మొదటిదాన్ని అక్టోబర్ నెల జీతంతో కలిపి ఉద్యోగులకు చెల్లించనుంది.
- Advertisement -



