కొన్ని పంటలకేనంటూ కేంద్రం కొర్రీలు
ఎల్‌నినోతో పుట్టెడు కష్టాల్లో రైతన్నలు
ఇన్సూరెన్స్ కంపెనీలతో అందేది అంతంతే…
వ్యవసాయ శాఖ అంచనాలతో పరిహారం ఇప్పించాలని డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎల్‌నినో ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉంది. భూగర్భజలాలు అడుగంటడంతో వరిపైర్లతో పాటు మెట్ట పంటలూ ఎండిపోతున్నాయి. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలకు గురవుతు న్నారు. పత్తి పంట విషయానికొస్తే ఎకరానికి సగం దిగుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. కౌలు రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. అటు కౌలుప రంగా…ఇటు పంట విషయంలోనూ నష్టపో వాల్సిన దైన్యస్థితి నెలకొంది. పంట నష్ట పరిహారాన్ని అంచనా వేయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నాయి. కంటింజెన్సీ ప్లాన్ అమలు చేస్తున్నామనే మాటలు గొప్పలు చెప్పుకోవడానికే పరిమితం అవుతున్నాయి. అటు పంటల బీమా లేక..ఇటు పాలకుల నుంచి భరోసా లభించక రాష్ర్ట రైతాంగం మరోసారి అరిగోసకు సిద్ధమవుతోంది. రాష్ర్ట ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన ఫసల్‌బీమాలో చేరలేదు కాబట్టి మేం ఏం చేయలేమని మోడీ సర్కార్ చేతులెత్తేస్తుంది. కానీ అన్నదాతలను ఆదుకునేందుకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తులు చేసి, ఎల్‌నినో రాజకీయాన్నిరక్తి కట్టిస్తున్నది.
19 జిల్లాల్లో కరువు
తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి నేటి వరకూ రాష్ట్రంలో 20 శాతానికపైగా లోటు వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 16 వరకు సాధారణ 664.5 మిల్లీమీటర్ల (మి.మీ.,)కుగానూ 536.5 మి.మీ., వర్షపాతమే నమోదైంది. 33 జిల్లాలకుగానూ 19 జిల్లాలు వర్షాభావ కేటగిరీలో ఉన్నాయి. వానాకాలం పంటల సాగు 88 శాతానికే పరిమితమైంది. వరి సాగు దాదాపు 18 శాతం తగ్గింది.వరి 55.90 లక్షల ఎకరాలు, పత్తి 48.33 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 5.93 లక్షల ఎకరాలు, సోయాబీన్ 3.72 లక్షల ఎకరాలు, మిర్చి 2.67 లక్షల ఎకరాలు, చెరుకు 41 వేల ఎకరాలలో సాగైంది. ఓవైపు భూగర్భజలాలు లోతుల్లోకి పడిపోవడం, మరోవైపు ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు అడుగండటంతో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వరిపైర్లు ఎండిపోతున్నాయి. వరి తర్వాత అత్యధికంగా సాగు చేసేది పత్తి పంటనే. తెలంగాణలో భూమి స్వభావాన్ని బట్టి ఎకరాలో సగటున 8 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్లు పండాలి. కానీ, వర్షాభావ పరిస్థితులతో ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. పత్తి మొక్కలు జానెడు నుంచి మూరెడు ఎత్తు వరకు మాత్రమే పెరిగాయి. ఎండలను తట్టుకోలేక మొక్కలు వడలిపోతున్నాయి.
ఎన్‌నివో ఎఫెక్ట్
ఫసల్‌బీమా యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రీమియం వాటా ఎక్కువగా ఉండటం, ఆయా రాష్ర్టాల్లో సొంతంగా బీమా పథకాలు ఉండటం, పరిహారం విషయంలో జాప్యం వల్ల చాలా రాష్ర్టాలు ఆ పథకం నుంచి వెనక్కి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన పంటలనే వేయాలనే నిబంధన కూడా దీనికి ప్రధాన కారణం. ఈ కారణంతోనే ఏపీ, తెలంగాణ, గుజరాత్, బెంగాల్, తదితర రాష్ర్టాలు ఈ బీమాలో చేరేందుకు ఆసక్తి చూపలేదు. రాష్ట్ర ప్రీమియం వాటా కంటే రైతులకు ఎక్కువ లబ్ది చేకూరుస్తున్నామంటూ ఆ పథకం నుంచి తెలంగాణ వెనక్కి వచ్చింది. అయితే, తెలంగాణ మినహా మిగిలిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా రైతుల కోసం బీమా పథకాలను తీసుకొచ్చాయి. తెలంగాణలో మాత్రం అలాంటి పథకం లేదు. ఫసల్‌బీమా పథకం వల్ల బీమా కంపెనీలకు ఎక్కువ ఉపయోగం జరుగుతున్నదనీ, రైతుల క్లైయిమ్‌ల విషయంలో అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పరిహారం ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నదనే చర్చ కూడా ఉన్నది.
రైతు బంధుకు బీమా కొర్రి
రాష్ట్రంలో రైతుబంధుతో పాటు రైతులకు నేరుగా రూ.ఐదు లక్షల బీమా ఇస్తున్నామనే కారణంతో పంట నష్టపరిహారాన్ని నిరాకరిస్తూ వచ్చారు. 2018 ఎన్నికల సమయంలో ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం ఇచ్చారు. ఆ తర్వాత ఏ ప్రభుత్వం కూడా పరిహారంపై పల్లెత్తు ప్రకటన చేయకపోవడం గమనార్హం. ,అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నష్టం గురించి ప్రస్తావించకుండా, వచ్చే రబీ సీజన్ నుంచి ఫసల్‌బీమా యోజన పథకంలో చేరుతా మని ప్రకటించింది. అదే సమయంలో ఎన్డీఆర్ఎఫ్ నుంచి తగిన సహాయం చేయాలని కేంద్రాన్ని కోరింది. ఖరీఫ్ సీజన్లో తీవ్రంగా నష్టపోయిన రైతులు, ముఖ్యంగా కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి భరోసా కల్పించాల్సిన అవసర ముందని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని పంట నష్టపరిహారమివ్వాలి
ఫసల్‌బీమా యోజన పథకంలోని లోపాలను కేంద్ర ప్రభుత్వం సవరించాలి. ప్రీమియం పేరుతో రాష్ర్టాలపై మోపుతున్న భారాన్ని తగ్గించాలి. అదే సమయంలో వర్షపాతం విషయంలో మండలాన్ని కాకుండా గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని పంట నష్టపరిహారాన్ని అంచనా వేయాలి. నోటిఫై చేసిన పంటలకే బీమా అనే నిబంధనను కేంద్రం తొలగించాలి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో వెంటనే నష్ట.
టి.సాగర్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,తెలంగాణ రైతు సంఘం


