నవతెలంగాణ – కామారెడ్డి
అంతర్జాతీయ న్యాయ దినోత్సవం (Law Day) సందర్భంగా లయన్స్ క్లబ్ కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా బార్ అసోసియేషన్‌లో న్యాయమూర్తులు, న్యాయాధికారులను శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శముక్తిదా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) కార్యదర్శి నాగరాణి, సీనియర్ సివిల్ జడ్జి సుమలత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి దీక్ష బట్, జిల్లా కోర్టు ప్రభుత్వ న్యాయవాది (Government Pleader) శ్యాం గోపాల్ రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. నారాయణ, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూర్య ప్రసాద్, అదనపు ప్రభుత్వ న్యాయవాది షబానాలను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కామారెడ్డి అధ్యక్షుడు వి. ప్రదీప్ కుమార్, కార్యదర్శి ఎం. గంగాధర్, లయన్స్ క్లబ్ సభ్యులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థ సమాజంలో న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని, న్యాయవాదులు, న్యాయమూర్తుల సేవలు సమాజానికి ఆదర్శప్రాయమని వక్తలు పేర్కొన్నారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



