Friday, September 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏసీబీకి చిక్కిన 
కీసర సీఐ, ఎస్‌ఐ

ఏసీబీకి చిక్కిన 
కీసర సీఐ, ఎస్‌ఐ

- Advertisement -

స్టేషన్‌ ‌బెయిల్‌ ‌కోసం రూ.5 లక్షల లంచం
నవతెలంగాణ–కీసర
​స్టేషన్‌ బెయిల్‌ కోసం రూ.5 లక్షల లంచం తీసుకున్న కీసర సీఐ, ఎస్‌ఐని ఏసీబీ అధికారులు రెడ్‌ ‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. కీసర పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ కేసు వివరాలు వెల్లడించారు. మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా అహ్మద్‌గూడలో సెప్టెంబర్ 2న 650 బస్తాల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకుని కీసర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసులో నిందితుడైన సయ్యద్ ఈర్షాద్‌కు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి రూ. 10 లక్షల లంచం ఇవ్వాలని కీసర సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు ముందస్తుగా రూ. 3.35 లక్షలు అడ్వాన్స్‌ గా అందజేశాడు.ఈర్షాద్ మరో రూ. 5 లక్షలను బుధవారం రాత్రి రాంపల్లి పాత చెరువు సమీపంలో వినాయక నిమజ్జనం జరుగుతున్న ప్రాంతంలో వారికి ఇస్తుం డగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి సీఐ, ఎస్‌ఐని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కీసర పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. వారి ఇండ్లలోనూ ఏకకాలంలో సోదాలు జరుపుతున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.

​బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్న బాధితులు
సీఐ ఆంజనేయులు ఏసీబీకి చిక్కడంతో ఆయన బాధితులు పెద్దఎత్తున కీసర పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సంద ర్భంగా బాధితులు పంబళ్ల రమేష్, గుర్రాల కృష్ణారెడ్డి మాట్లాడుతూ .. “సీఐ అక్రమార్కులకు కొమ్ముకాస్తూ, బాధితులకు న్యాయం చేయకుండా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. మాలాంటి వారిని మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఈ సీఐపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -