Thursday, July 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌బీఆర్‌ఎస్‌ పోరాటాల వల్లేనార్లాపూర్‌ పంపుహౌస్‌ ప్రారంభం

‌బీఆర్‌ఎస్‌ పోరాటాల వల్లేనార్లాపూర్‌ పంపుహౌస్‌ ప్రారంభం

- Advertisement -

కన్నేపల్లి మోటార్లనూ ఆన్‌ చేయాలి : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

‌నార్లాపూర్‌ ‌పంపుహౌస్‌‌లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం రైతులతో కలిసి బీఆర్ఎస్ సాధించిన విజయమని ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎక్స్‌ ‌ద్వారా స్పందించారు. బీఆర్ఎస్ పోరాటాల ఫలితంగానే “పాలమూరు-రంగారెడ్డి” ప్రాజెక్టులో కీలకమైన నార్లాపూర్‌లో జలగర్జన ‌జరిగిందని తెలిపారు. అన్నదాతల పక్షాన గులాబీ సైనికులు అలుపెరగకుండా అన్నివైపులా ఒత్తిడి పెంచడంతోనే సీఎం రేవంత్‌‌రెడ్డి దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డితోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచే దాకా పట్టువదలని విక్రమార్కుల్లాగా కదంతొక్కిన బీఆర్ఎస్ సైనికులందరికీ సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. దశాబ్దాలపాటు దగాపడ్డ దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న కేసీఆర్ సమున్నత సంకల్పం ఏమాత్రం చెక్కుచెదరలేదని పేర్కొన్నారు. పాతాళం నుంచి నీటిని ఎత్తిపోస్తున్న ఈ దృశ్యాలే సగర్వంగా చాటి చెబుతున్నాయని వివరించారు. నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి పరవళ్లు తొక్కుతున్న కృష్ణాజలాలు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ దార్శనికతకు నిలువెత్తు నిదర్శ‌నమని తెలిపారు. రెండున్నరేండ్లుగా కాళేశ్వరంతోపాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావుపెట్టి రైతులకు తీరని అన్యాయం చేసినందుకు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. బీఆర్ఎస్‌తోపాటు రైతుల ఒత్తిడికి తలొగ్గి నార్లాపూర్ పంపుహౌస్ ఎలా ఆన్ చేశారో, అదే రకంగా కన్నేపల్లి మోటార్లు కూడా స్విచ్ ఆన్ చేసి రేవంత్‌‌రెడ్డి ఇప్పటికైనా పాపప్రక్షాళన చేసుకోవాలని కోరారు. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -