అంగన్వాడీ టీచర్, కవయిత్రి తోట్ల వెంకటలక్ష్మి
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని వస్త్రం తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న లాలుతాండాలో ఘనంగా పోషణ మాసం నిర్వహించినట్లు అంగన్వాడి సెంటర్ టీచర్, కవయిత్రి అయిన తోట్ల వెంకటలక్ష్మి తెలిపారు. బుధవారం సూపర్వైజర్ సరిత ఆదేశాల మేరకు తల్లులు గర్భిణులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడి సెంటర్ లో పిల్లలకు గర్భిణులకు బాలింతలకు అందించే ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆహారం తీసుకుంటే పిల్లలు మంచి ఆరోగ్యవంతులుగా ఎదుగుతారని తెలిపారు. తల్లులకు, గర్భిలకు ఎంతో శక్తి కలుగుతుందని చెప్పారు. ఈ పౌష్టికాహారం తీసుకుంటే పోషణ లోపం లేకుండా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం యశోద ఆశ వర్కర్ శారద గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు.
లాలు తండాలో ఘనంగా పోషణమాసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



