Sunday, September 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కౌలాస్ లో బోరుబావి సమస్యను పరిష్కరించిన సర్పంచ్

కౌలాస్ లో బోరుబావి సమస్యను పరిష్కరించిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని కౌలాస్ గ్రామంలో బోరు బావి రిపేర్లు చేసి కాలనీ వాసులకు నీటి సమస్య పరిష్కారం చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ యంబరి విద్య తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని కాలనీలో బోరుబావి రిపేర్లు రావడంతో నీటి ఎద్దడి సమస్య నెలకొంది. గ్రామస్తులు గ్రామ సర్పంచ్ కు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని పరీశీలించారు. సమస్య తీవ్ర ప్రభావం చూపుతుందని స్పందించి వెంటనే మరమ్మతులు చేయించడం జరిగింది. నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించిన గ్రామ సర్పంచ్ కు, జీపీ కార్యవర్గ సభ్యులకు ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు సమస్యను పరిష్కరించడం సంతోషంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -