Monday, September 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసింగర్‌ హత్య.. 5 కోట్ల వ్యూస్‌ పాటే కారణం

సింగర్‌ హత్య.. 5 కోట్ల వ్యూస్‌ పాటే కారణం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హరియాణా సింగర్‌ అంకిత్‌ బాల్యన్‌ హత్య వెనుక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 26న ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో జిమ్‌ బయట దుండగులు అతడిని కాల్చి చంపారు. అతడు నటించిన ఓ పాట యూట్యూబ్‌లో 5.4 కోట్లకుపైగా వ్యూస్‌ సాధించడంతో పాటు, అందులోని సాహిత్యం గ్యాంగ్‌ లీడర్‌ జితేందర్‌ గోగిని అవమానించేలా ఉందని ‘గోగి గ్యాంగ్‌’ భావించినట్లు పోలీసులు తెలిపారు. గతంలో బెదిరింపులు వచ్చినప్పటికీ అంకిత్‌ తాను కేవలం పాటలో నటించానని చెప్పాడు. అయినా గ్యాంగ్‌ సభ్యులు రెక్కీ నిర్వహించి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -