- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: థాయ్‌లాండ్‌లో సాంగ్‌క్రాన్ పండుగ సందర్భంగా జరిగిన 950కిపైగా రోడ్డు ప్రమాదాల్లో 191 మంది మరణించారు. ఇందులో 900 మంది గాయపడ్డారు. థాయ్ న్యూఇయర్ సందర్భంగా జరిగే ఈ వేడుకల్లో లక్షలాది మంది సొంతూళ్లకు వెళ్తుంటారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు సంభవించినట్లు తెలుస్తోంది. ‘ప్రపంచంలోనే అతిపెద్ద నీటి పోరాటం’గా పేరుగాంచిన ఈ పండుగ విషాదంతో ముగిసింది.
- Advertisement -



