- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. శుక్ర, శనివారాల్లో ఉత్తర, దక్షిణ తెలంగాణలో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఈ నెల 19 నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వడగండ్ల వానలు కూడా పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
- Advertisement -



