Friday, April 17, 2026
E-PAPER
Homeక్రైమ్కలెక్టర్‌ సమక్షంలో మహిళ ఆత్మహత్యాయత్నం

కలెక్టర్‌ సమక్షంలో మహిళ ఆత్మహత్యాయత్నం

- Advertisement -

ఇందిరమ్మ ఇంటి మంజూరులో
అన్యాయం జరిగిందని ఆవేదన
పురుగుల మందు తాగిన మహిళ..
కోదాడ ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ-మునగాల

ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరు విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ ఓ మహిళ కలెక్టర్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన గురువారం సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని రైతువేదికలో జరిగింది. వివరాల్లోకెళితే.. మునగాల మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక సభ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌ లాల్‌ పవార్‌, ఎస్పీ నర్సింహా హాజరయ్యారు. సమావేశం అనంతరం కలెక్టర్‌ వెళ్లిపోతున్న సమయంలో.. తాడువాయి గ్రామానికి చెందిన దళిత మహిళ కోటా సునీత తనకు ఇందిరమ్మ ఇంటి మం జూరు విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తెచ్చింది. తనకు ఆరు మాసాల కిందట జరిగిన ప్రజాపాలన సభలో ఇల్లు మంజూ రైనట్టు ఆమె చెప్పారు. గ్రామసభలో లిస్టులో తన పేరున్నట్టు చదివి వినిపించారని తెలిపారు. దీంతో తమ పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇంటి నిర్మాణం చేసుకున్నట్టు చెప్పారు. బిల్లు చెల్లించాలని పలుమార్లు అడిగినా అధికారులు పట్టించుకోవటం లేదని కన్నీరు పెట్టుకుంది. ఈ విషయమై బాధితురాలు పలుమార్లు గ్రీవిన్స్‌డేలో కలెక్టర్‌ దృష్టికి తెచ్చింది. అయితే సునీత పేరు మీద 2008లోనే ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. అందువల్ల ప్రస్తుతం ఇల్లు రాదంటున్నారు. అయితే, తనకు 2008లో ఇల్లు రాలేదని, నిర్మాణమే జరగలేదని ఆమె అధికారులకు మొరపెట్టుకున్నారు. ఆరు మాసాలుగా అది óకారుల చుట్టూ తిరిగి ఆమె విసుగు చెందింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఒక్కసారిగా కలెక్టర్‌ సమక్షంలోనే పురుగుల మందు తాగింది. పోలీసులు అధికారులు అడ్డుతగి లారు. అప్పటికే ఆమె పురుగుల మందు తాగటంతో వెంటనే పోలీసుల వాహనంలో కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమె మందు తాగుతున్న సమయంలో అక్కడున్న కొందరి కండ్లల్లోనూ చిల్లింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -