– హాజరైన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మెన్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాజ్యసభ సభ్యులుగా తెలంగాణ నుంచి ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీల చేత గురువారం రాజ్యసభలో చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత అభిషేక్ మను సింఘ్వీ దేవుడిపై ప్రమాణం చేస్తూ.. హిందీలో ప్రమాణం చేశారు. అనంతరం వేం నరేందర్ రెడ్డి భగవంతుడిపై విశ్వాసం చూపుతూ… ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. అయితే ఇటీవల తెలంగాణతో పాటు అస్సోం, బీహార్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రల నుంచి కొత్తగా ఎన్నికైన నేతలు రాజ్య సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. ఇందులో బీహార్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ (బీజేపి), శివేశ్ కుమార్(బీజేపి), ఉపేంద్ర కుష్వాహా(ఆర్‌ఎల్‌ఎం), రాంనాథ్ ఠాకూర్(జేడీయూ), అస్సాం నుంచి తేరాష్ గోవల్ల(బీజేపి), జొజెన్ మోహన్(బీజేపి), ప్రమోద్ బోరో(యూపీపీుఎల్), చత్తీస్ ఘడ్ నుంచి లక్ష్మీ వర్మ(బీజేపి), దేవి నేతం(కాంగ్రెస్), హర్యానా నుంచి కరంవీర్ సింగ్ బోధ్(కాంగ్రెస్), సంజరు భాటియ(బీజేపీ), హిమాచల్ ప్రదేశ్ నుంచి అనురాగ్ శర్మ( కాంగ్రెస్), మహారాష్ట్ర నుంచి వినోద్ శ్రీధర్ తావ్డే(బీజేపి), ఒడిశా నుంచి సుజీత్ కుమార్ (బీజేపీ)లు రాజ్య సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. నూతన సభ్యులకు చైర్మెన్ సీ పీ రాధాకష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు.
హాజరైన సీఎం, మంత్రులు…
తెలంగాణ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వివేక్ వెంకట స్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, ఎంపీలు గడ్డం వంశీకష్ణ, సురేశ్ షట్కర్ హాజరయ్యారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, ఇతర నేతలు వీఐపీ గ్యాలరీ నుంచి ప్రమాణోత్సవానికి వీక్షించారు. అనంతరం పార్లమెంట్‌లో సీఎం సమక్షంలో మంత్రులు సీతక్క, వివేక్ వెంకట స్వామి, పొంగులేటి, వాకిటి, ఎంపీలు, ఇతర నేతలు వేం నరేందర్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా… మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీకష్ణలు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
రాజ్యసభ సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ ప్రమాణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



