Friday, April 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండప్పు కళాకారులకు పింఛన్‌ ఇవ్వాలి

డప్పు కళాకారులకు పింఛన్‌ ఇవ్వాలి

- Advertisement -

కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని డప్పు కళాకారులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం లాగా ఫించన్‌ ఇవ్వాలని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యాలయం వద్ద డప్పు కళాకారుల తో కలిసి ఆయన కరపత్రం ఆవిష్కరించారు. అనంతరం డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రెమిడాల పర్శరాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్కైలాబ్‌ బాబు మాట్లాడుతూ ప్రాచీన కాలం నుండి ప్రజలకు ప్రచార సాధనంగా ఉన్న డప్పు కళకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. దళితులను అంటరాని వాళ్ళుగా చూస్తున్న సమాజంలో డప్పు కళను కూడా అంటరాని కళగా అవమానిస్తున్నారని విమర్శించారు. శుభ, అశుభ కార్యక్రమాలు, ఉత్సవాలు జాతరలు పండుగలు అన్నిటికి ముందుండే డప్పు కళాకారుడికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు తెలంగాణ ప్రభుత్వం రూ.7వేల ఫించన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డిజిటల్‌ గుర్తింపు కార్డులు, ఆరోగ్య బీమా, డప్పులు, గజ్జలు ఉచితంగా అందించడంతో పాటు ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకల్లో అవకాశం కల్పించాలన్నారు. వయసుతో సంబంధం లేకుండా వృత్తిని నమ్ముకున్న కళాకారులందరికీ నెలవారీ గౌరవ వేతనం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని కోరారు. జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డప్పు కళాకారుల సంఘం సహాయ కార్యదర్శులు నందిగామ కృష్ణ, డొనక దర్గయ్య, రాంబాబు, సైదులు, సాయి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -