Friday, April 17, 2026
E-PAPER
Homeజాతీయంఏకాభిప్రాయంతోనే సాధ్యం

ఏకాభిప్రాయంతోనే సాధ్యం

- Advertisement -

లేనిపక్షంలో సీట్ల కేటాయింపుపై చర్చలు జరపాలి : సీపీఐ(ఎం) డిమాండ్‌
నియోజకవర్గాల పునర్విభజనపై సీపీఐ(ఎం) 24వ మహాసభ ఆమోదించిన తీర్మానం పూర్తి పాఠం
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ఏ రాష్ట్రానికైనా వుండే దామాషా ప్రాతినిధ్య వాటాను తగ్గించే లేదా కుదించే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను దేన్నైనా ఎం 24వ మహాసభ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ కీలకమైన అంశంపై స్థూలంగా ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలతో, రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృతంగా చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని మహాసభ కోరుతోంది.
పార్లమెంట్‌, రాష్ట్రాల శాసనసభల సీట్ల సంఖ్యపై గల స్తంభన వచ్చే ఏడాది చివరితో పూర్తి కానుండడంతో 2026 తర్వాత మొదటి జనగణన నిర్వహించిన అనంతరం తాజాగా నియోజకవర్గాల పునర్విభజన అవసరమవుతుంది. 1976లో ఎమర్జన్సీ సమయంలో తీసుకువచ్చిన 42వ రాజ్యాంగ సవరణ, జనాభా నియంత్రణ చర్యలను పెంపొందించేందుకు వీలుగా తొలుత సీట్ల కేటాయిం పులను స్తంభింపచేసింది. ఈ స్తంభనను తర్వాత వాజ్‌పేయి ప్రభుత్వం 2026 వరకు పొడిగించింది.

చారిత్రకంగా, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలు 1952, 1963, 1973ల్లో నిర్వహించారు. అయితే, 1976లో స్తంభన నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన పున:పంపిణీపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరిం చేందుకు తదనుగుణమైన సద్దుబా ట్లు వాయిదా వేశారు. 2001లో జనగణన జరిగినప్పటికీ, తమ ప్రాతినిధ్యంలో అన్యాయంగా కోత పడుతుందని ఆందోళన చెందుతున్న దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన కారణంగా స్తంభన అమల్లోనే వుంది. సీట్ల సంఖ్యపై గల స్తంభన ముగియనున్నందున కొత్తగా చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ రాజకీయ ప్రాతినిధ్యాన్ని గణనీయంగా మార్చగలదు. కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాలు అసమానంగా ప్రభావితం కావచ్చు. వీటిలో చాలా రాష్ట్రాలు విజయవంతంగా జనాభా నియంత్రణ చర్యలు అమలు చేశాయి. ఈ కారణంగా ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ముప్పు వుంది. అధిక జనాభా పెరుగుదల రేట్లు కలిగిన రాష్ట్రాలు అనవసరమైన ప్రయోజనాలు పొందవచ్చు. మొత్తంగా సీట్ల సంఖ్య పెరిగినప్పటికీ, కేవలం జనాభా ప్రాతిపదిక విధానం ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకు అనుకూలంగా అసమానమైన రీతిలో కేటాయింపులు దక్కవచ్చు. జాతీయ ఐక్యతను, సమ గ్రతను పాటిస్తూనే అన్ని రాష్ట్రాల హక్కులను గౌరవించే సమానమైన, న్యాయమైన ఫెడరల్‌ చట్ర పరిధికి సీపీఐ(ఎం) 24వ మహాసభ కట్టుబడి వుంది.

1.నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఏదైనా ఏ ఒక్క ప్రాంతానికి లేదా రాష్ట్రానికి అసమానమైన ప్రయోజనాన్ని అందివ్వకుండా నివారించాలి. విజయవంతంగా జనాభా పెరుగుదలను నియం త్రించిన రాష్ట్రాల ప్రయోజనాలు పరిరక్షించబడాలి.
2. సక్రమమైన, సమతూకంతో కూడిన ప్రాతినిధ్యానికి హామీ కల్పిస్తూ రాష్ట్రాల మధ్య ప్రస్తుతమున్న దామాషా సీట్ల పంపిణీని కొనసాగిస్తూనే, పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని విస్తరించేందుకు ప్రొ రేటా సీట్ల పెంపును అనుమతించాలి.
3.ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో వున్న ఎస్‌సీ/ఎస్‌టీ సీట్ల నిష్పత్తిని పరిరక్షించాలి.
4. సమానత్వం, సమాఖ్యవాదం, లౌకికవాదం, జాతీయ ఐక్యత సూత్రాలను పునర్విభజన ప్రక్రియ పరిరక్షించేలా చూసేందుకు అన్ని రాష్ట్రాలతో భారత ప్రభుత్వం సమగ్ర చర్చలు నిర్వహించాలి.
5.పునర్విభజన ప్రక్రియపై విస్తృత ఏకాభిప్రాయం లేని పక్షంలో సమాఖ్య సమగ్రతను పరిరక్షించేందుకు గానూ సీట్ల కేటాయింపుపై గల స్తంభనను మరింతగా పొడిగించాలి.

నేడు నోయిడాలో ఎంఏ బేబీ పర్యటన
పోలీసులు అరెస్టు చేసిన, వారు చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న నాయకుల, కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు నోయిడాలో శుక్రవారం సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి ఎంఎ బేబీ పర్యటించనున్నారు. నోయిడా, పరిసర ప్రాంతాల్లో మెరుగైన వేతనాలు, ఇతర డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న కార్మికులపై ఉత్తరప్రదేశ్‌, హర్యానా ప్రభుత్వాలు అరెస్టులు, లాఠీఛార్జీలు, నిర్భంధనాలు, దేశవ్యతిరేక ఆరోపణలతో తీవ్రస్థాయిలో అణచివేతకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. గురువారం ముందుగా ఉదయం 9 గంటలకు సిపిఎం కేంద్ర కమిటీ కార్యాలయం ఎకె గోపాలన్‌ భవన్‌ నుంచి పార్టీ పార్లమెంట్‌ సభ్యులతో కలిసి ఎంఏ బేబీ బయలు దేరనున్నారు. నోయిడా సెక్టార్‌ 8లో బాన్స్‌బల్లి మార్కెట్‌ వద్ద నిర్బంధంలో ఉన్న నాయకుల కుటుంబాలతో బేబీ సమావేశం కానున్నారు. అనంతరం వీరితో కలిసి ఉదయం 11 గంటలకు జిల్లా మేజిస్ట్రేట్‌ను కలుస్తారు. ఈ కార్యక్రమం తరువాత పోలీసులు అరెస్టు చేసి, వారి దాడిలో గాయపడిన కార్మికుల కుటుంబాలను ఎంఏ బేబీ పరామర్శిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -