- Advertisement -
బజాజ్ ఫిన్‌సర్వ్ ఎఎంసి వెల్లడి
ముంబయి : ఇటీవలి మార్కెట్ల పతనం, మెరుగైన ప్రాథమిక అంశాలు, అప్పులు తగ్గి బ్యాలెన్స్ షీట్లు బలోపేతం కావడం వల్ల స్మాల్-క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులకు మళ్లీ అనుకూలమైన ప్రవేశ సమయమని బజాజ్ ఫిన్‌సర్వ్ ఏఎంసీ తాజా రిపోర్ట్‌లో పేర్కొంది. దాదాపు 50 శాతం స్మాల్-క్యాప్ షేర్లు వాటి 10 ఏళ్ల సగటు వాల్యుయేషన్ల కంటే తక్కువ ధరకు లభిస్తుండటం ఇన్వెస్టర్లకు మంచి అవకాశమని తెలిపింది. మార్కెట్ కరెక్షన్లు స్మాల్ క్యాప్ విభాగంలో ఉన్న అధిక వాల్యుయేషన్ల ఒత్తిడిని తొలగించాయని, దీర్ఘకాల సంభావ్యత కలిగిన నాణ్యమైన కంపెనీలలో క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక మంచి తరుణమని సూచించింది.
- Advertisement -



