Thursday, September 17, 2026
E-PAPER
Homeఖమ్మంతెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచానికే ఆదర్శం

తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచానికే ఆదర్శం

- Advertisement -

– సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సింగు నరసింహారావు
నవతెలంగాణ-సత్తుపల్లి 

భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సింగు నరసింహారావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల  సందర్భంగా సత్తుపల్లి మండలం యాతాలకుంటలోని కొర్సా  జోగయ్య, కొర్సా పెంటయ్యల స్థూపాల వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ.. నైజాం నవాబుల, జమీందార్ల ఆగడాలకు వ్యతిరేకంగా రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొహినుద్దీన్ల నాయకత్వంలో పోరాటం సాగిందన్నారు.

బాంచన్ దొర నీ కాల్మొక్తా అన్న ప్రజల చేత తుపాకులు పట్టించి, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, బందగీ వంటి సామాన్యులను వీరులుగా తీర్చిదిద్దిన ఘనత కమ్యూనిస్టు పార్టీదేనని కొనియాడారు. ​చారిత్రాత్మక తెలంగాణ పోరాటాన్ని నేడు మతోన్మాదులు, బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య వైషమ్యాలు రేపేలా చిత్రీకరిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల మధ్య చీలిక తెచ్చేందుకు యత్నిస్తున్న వారి పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ, తోట రామాంజనేయులు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేము రాంబాబు, సీపీఐ మండల కార్యదర్శి తడకమళ్ల యోబు, కొర్సా  వెంకటమ్మ, మాధవి, ప్రభాకర్, బూచమ్మ, వెంకటేశ్వర్లు, శ్రీదేవి, ప్రసాద్, పండు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -