- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని రథం గల్లి గోశాల ప్రక్కన రోడ్డుపైన చెత్తాచెదారం డంప్ చేయడంతో గోశాల ఆవులు ప్లాస్టిక్ కవర్లు తిని ప్రాణ హాని కలిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మూగజీవాల రక్షణార్థం చెత్తను గోశాల పక్కన వేయవద్దని వారు విజ్క్షప్తి చేస్తున్నారు. వెంటనే గ్రామపంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకుందామని, మూగ జీవాలను కాపాడుకుందానమి వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
- Advertisement -



