Tuesday, April 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువులకు బీమా ఏది.?

పశువులకు బీమా ఏది.?

- Advertisement -

పాడి రైతులను ఆదుకోని పథకం
పదేళ్ల క్రితమే ఎత్తేసిన వైనం
నవతెలంగాణ – మల్హర్ రావు

రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. కానీ పాడి పశువులకు ఎలాంటి బీమా సౌకర్యం లేదు. పాడి పశువులు అనారోగ్యం, ఇతర కారణాలతో మృతి చెందితే బీమా సౌకర్యం లేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. మండల వ్యాప్తంగా 10,047 మూగజీవాలు ఉన్నాయి. ఇందులో ఆవులు, గేదెలు 2,784, మేకలు, గొర్రెలు 7,263 ఉన్నాయి. పాడి పశువులకు బీమా ఉంటే ఆయా సంస్థల నుంచి గతంలో పశువుల అంచనాను బట్టి రూ.50 వేల వరకు నష్ట పరిహారం వచ్చేది.

ప్రస్తుతం ప్రభుత్వం అలాంటి సౌకర్యం కల్పించక పోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల వద్ద ఉన్న ఆవులు, గేదెలు, ఎద్దులకు గతంలో లాగే ప్రభుత్వం 50 శాతం నిధులు కేటాయించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మండలంలో తాడిచెర్ల, నాచారం, కొండంపేట, వళ్లెంకుంట, మల్లారం, పెద్దతూండ్ల, రుద్రారం, ఎడ్లపల్లి గ్రామాల్లో రైతులు వ్యవసా యంతో పాటు ఎక్కువగా పాడి పశువులను పోషిస్తూ జీవనం సాగిస్తున్నారు. గతంలో బీమా సౌకర్యం ఉన్నప్పుడు పశువులు అనారోగ్యంతో మృతి చెందితే ఎంతో కొంత పరిహారం వచ్చేది. కానీ ప్రస్తుతం బీమా సౌకర్యం లేకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పశువులకు బీమా సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు.

గతంలో చెల్లించేవారు: అభిలాస్, మండల పశువైద్యాధికారి
పాడి పశువులకు బీమా పథకం కింద గతంలో పరిహారం చెల్లిం చేవారు. కానీ ప్రభుత్వం పథకాన్ని పదేళ్ల క్రితం నిలిపివేసింది. ప్రస్తుతం డెయిరీ ఫాంలలోని పాడి పశువులకు బీమాకోసం కేంద్ర ప్రభుత్వం కొంత బడ్జెట్ను కేటాయించనుంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే పాడి రైతులకు తెలియజేస్తాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -