Magazines

ఎలక్ట్రానిక్‌ ఏఐ రోబోట్‌ !

48 నిమిషాల క్రితం

Electronic AI robot!
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 3 నిమిషాల చదవడం

ప్రపంచంలోనే తొలిసారిగా ఆవిష్కరించిన చైనా
పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో రూపకల్పన
సంప్రదాయ ఆర్కిటెక్చర్‌లోని లోపాలు, వైఫల్యాలకు చెక్‌
రోబోటిక్‌ పరిశ్రమలో అత్యంత స్వయంప్రతిపత్తి దిశగా అడుగులు
బీజింగ్‌ : పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఏఐ రోబోట్‌ను చైనాలోని హుబే రాష్ట్రంలో ఉన్న ఇచాంగ్‌లో సోమవారం ఆవిష్కరించారు. ఇది ఎలక్ట్రానిక్‌ నిర్మాణంతో రూపొందించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ రోబోట్‌. కృత్రిమ మేధ సాయంతో తీసుకునే నిర్ణయాలను భౌతిక చర్యతో అనుసంధానించే వ్యవస్థలపై స్వయంప్రతిపత్తిని సాధించాలన్న చైనా ప్రయత్నాలలో ఈ ఆవిష్కరణ ఓ ముఖ్యమైన ముందడుగు అని నిపుణులు అభిప్రాయపడ్డారు. సీసీటీవీ న్యూస్‌ అందించిన వివరాల ప్రకారం..ఈ ఎలక్ట్రానిక్‌ ఏఐ రోబోట్‌ నియంత్రణ, ఏఐ కంప్యూటింగ్‌లను వేరు చేయడానికి, ఏకీకృతం చేయడానికి కూడా దోహదపడుతుంది. ఏఐ సాయంతో తీసుకునే నిర్ణయాల నుంచి వాటిని భౌతికంగా అమలు చేసే వరకూ పూర్తిగా దేశీయ సాంకేతిక పునాదుల పైనే ఇది ఆధారపడింది. విదేశీ పరిష్కారాల అవసరం లేని సాంకేతికతను అందిస్తుంది.

ఆ నిర్మాణం ఓ తెలివైన నాడీ వ్యవస్థ
ఏఐ రోబోట్‌లోని ఎలక్ట్రానిక్‌ నిర్మాణం ఓ తెలివైన నాడీ వ్యవస్థగా పనిచేస్తుంది. ఇది రోబోట్‌ యొక్క నిర్వహణ వ్యవస్థ, నెట్‌వర్కింగ్‌, సాఫ్ట్‌వేర్‌ పరికరాలు, ఏఐ కంప్యూటింగ్‌ చిప్స్‌తో అనుసంధానమై దాని పనితీరుకు గరిష్ట పరిమితిని నిర్దేశిస్తుంది. ఒకవేళ రోబోట్‌ను ఎవరైనా వ్యక్తితో అనుసంధానిస్తే ఎలక్ట్రానిక్‌ నిర్మాణమే దాని నాడీ వ్యవస్థగా పనిచేస్తుంది. అంటే ఆ వ్యక్తి మెదడు ఎంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ నాడీ వ్యవస్థ లేకుండా రోబోట్‌ పనిచేయలేదు. 'ఈ ఆవిష్కరణతో చైనా రోబోటిక్స్‌ పరిశ్రమ కీలక భాగాలలో అత్యంత స్వయంసమృద్ధి వైపు ఎలా పయనిస్తోందో నిరూపణ అయింది. ఏఐది ఆలోచన. రోబోట్‌ది క్రియ. ఈ రెండింటి మధ్య నమ్మకమైన, సురక్షితమైన, నియంత్రణతో కూడిన ఓ వ్యవస్థ ఉండాలి. అదే ఎలక్ట్రానిక్‌ ఆర్కిటెక్చర్‌' అని నిపుణులు తెలిపారు. ఈ ఎలక్ట్రానిక్‌ నిర్మాణాన్ని దేశీయంగా రూపొందించడాన్ని ప్రోత్సహించడమంటే భౌతిక ప్రపంచంలో ఏఐ అప్లికేషన్‌ యొక్క భద్రతను మన చేతులలో ఉంచుకోవడమేనని వారు చెప్పారు. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్‌ నిర్మాణం రోబోట్లకు అంతర్గత భద్రతను, పారిశ్రామిక సార్వభౌమత్వాన్ని అందిస్తుంది. అలాగే వాటి ప్రవర్తనకు కఠినమైన భద్రతా పరిమితులను విధిస్తుంది. ఉత్పత్తికి అంతరాయం కలగకుండా, సిబ్బందికి ప్రమాదం కలిగించకుండా చూస్తుంది. భౌతిక ప్రపంచంలో ఏఐని మరింత సురక్షితంగా, మరింత విశ్వసనీయంగా, మరింత నియంత్రించగలిగేలా చేయడానికి దీనిని రూపొందించారు. రోబోటిక్స్‌ పరిశ్రమలో సాంకేతిక సార్వభౌమత్వాన్ని ఈ ఎలక్ట్రానిక్‌ నిర్మాణం బలోపేతం చేస్తుంది.

ఎన్నో ప్రత్యేకతలు
మనుషులను రోబోట్లు ఢకొీంటాయేమోనన్న ఆందోళన ఇటీవలి కాలంలో వ్యక్తమవుతోంది. అయితే ఎలక్ట్రానిక్‌ నిర్మాణం రోబోట్‌ వ్యవస్థలోని లోపాలను, దానిపై జరిగే దాడులను, ఎదురయ్యే అసాధారణ పరిస్థితులను తట్టుకోగలదు. అదే సమయంలో ఏఐ యొక్క ప్రవర్తన అంతిమంగా భౌతిక, భద్రతకు సంబంధించిన పరిమితులలోనే ఉండేలా చేస్తుంది. నూతనంగా ఆవిష్కరించిన ఏఐ రోబోట్‌కు సిబ్బంది సాంకేతిక ధృవీకరణను పూర్తి చేశారు. సంప్రదాయ ఆర్కిటెక్చర్‌లను ఉపయోగించే రోబోట్లలో జాయింట్లు దెబ్బతినడం, సైబర్‌ దాడులు జరగడం, వాటిలోకి వైరస్‌ను చొప్పించడం వంటి పరిణామాలు సంభవిస్తే సర్క్యూట్‌ వైఫల్యాలు, ఆకస్మిక షట్‌డౌన్‌లు, వ్యవస్థ నియంత్రణను కోల్పోవడం వంటివి చోటుచేసుకుంటాయి. అయితే దేశీయంగా తయారు చేసిన ఎలక్ట్రానిక్‌ ఆర్కిటెక్కర్‌ రోబోట్‌ ఓ వైపు సురక్షితమైన పనితీరు కనబరుస్తూనే మరోవైపు కఠినతరమైన భద్రతా పరీక్షలలో ఉత్తీర్ణత సాధించింది.
అభివృద్థి పథంలో...

ఇటీవలి కాలంలో చైనాలో దేశీయ రోబోటిక్‌ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ అభివృద్ధి వ్యక్తిగత భాగాలలో ఆవిష్కరణల నుంచి సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ వ్యవస్థల ఏకీకరణ వరకూ సాగింది. చైనా పరిశ్రమ-సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ 2023లో మార్గదర్శకాలను విడుదల చేసింది. 2027 నాటికి సురక్షితమైన, విశ్వసనీయమైన పారిశ్రామిక, సరఫరాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని అది సూచించింది. ఈ ఏడాది మార్చిలో సమర్పించిన పదిహేనవ పంచవర్ష ప్రణాళిక (2026-2030) ముసాయిదా ప్రకారం ఈ ఐదు సంవత్సరాల కాలంలో రోబోటిక్స్‌ సహా వ్యూహాత్మక పరిశ్రమల అభివృద్ధిని బీజింగ్‌ వేగవంతం చేస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్