Magazines

సిరిసిల్ల సభకు భారీగా తరలిరండి

52 నిమిషాల క్రితం

Turn out in large numbers for the Sircilla meeting.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్ గౌడ్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సిరిసిల్ల సీఎం సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌ గౌడ్‌ పిలుపు నిచ్చారు. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సీఎం ఎ. రేవంత్‌రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభను కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు సమష్టి కృషితో విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రైతు రుణమాఫీ, కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్‌, సామాజిక భద్రత తదితర కార్యక్రమాలతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సిరిసిల్లతో పాటు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు సమన్వయంతో పనిచేసి సభకు ప్రజలను తరలించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. మహిళలు, యువత, రైతులు, కార్మికులు, నేతన్నలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. “సిరిసిల్లలో జరిగే ముఖ్యమంత్రి గారి సభ ప్రజా పాలనకు, అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలకు వేదిక కావాలి. కాంగ్రెస్‌ కుటుంబం మొత్తం ఐక్యంగా కదిలి సభను చారిత్రాత్మకంగా విజయవంతం చేయాలి” అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌ గౌడ్‌ కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్