Magazines

కొడంగల్‌‌ ప్రజల ఇండ్లనే కూల్చేస్తారా?

50 నిమిషాల క్రితం

మాజీమంత్రి హరీశ్‌‌రావు డిమాండ్‌
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

భూసేకరణ చట్టం-2013 ప్రకారం పరిహారమివ్వాలి : 
మాజీమంత్రి హరీశ్‌‌రావు డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
కొడంగల్ బిడ్డను అంటూ అక్కడి ప్రజల ఇండ్లనే కూల్చేస్తారా? రేవంత్ రెడ్డి అని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు ప్రశ్నించారు. మద్దూరులో రాత్రికి రాత్రే పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపించే హక్కు ఎవరిచ్చారని అడిగారు. ఈ మేరకు హరీశ్‌‌రావు ఎక్స్‌ ‌వేదిక ద్వారా మంగళవారం ట్వీట్‌ ‌చేశారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇంత కర్కశంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నిం చారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా గౌరవించరా?అని అడిగారు. ఒక్కసారిగా ఇండ్లు కూల్చితే, ఏండ్ల నుంచి నివాసం ఉన్నవారు ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. అధికారం ఉందని ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తారా అని తెలిపారు.పోలీసులను అడ్డు పెట్టుకుని బుల్డోజర్ రాజ్ అమలు చేస్తారా అని పేర్కొన్నారు. పేదల బతుకులను రోడ్డున పడేయడమేనా ప్రజా పాలన?అని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని గొప్పగా చెప్పే భూసేకరణ చట్టం–2013 ప్రకారం బాధితులకు తక్షణం న్యాయమైన పరిహారం, పునరావాసం కల్పించాలని హరీశ్‌‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్