పోస్టర్ ను ఆవిష్కరించిన నేతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన అనే లక్ష్యాలతో 1998 అక్టోబర్ 2న ఏర్పడిన కేవీపీఎస్ 28 ఏండ్ల సామాజిక ఉద్యమ ప్రస్థానంలో అనేక విజయాలు సాధించిందని పలువురు ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. 29వ సంవత్స రంలోకి అడుగుతున్న సందర్భంగా అక్టోబర్ 2 నుంచి 8 వరకు ఆ సంఘం ఆవిర్భావ దినోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిం చాలని, ఈ ఉత్సవాల్లో సామాజిక శక్తులు, కుల నిర్మూలన వాదులు, అభ్యుదయ శక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. మంగళవారం చిక్కడపల్లి కేవీపీఎస్ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆవిర్భావ దినోత్సవ వాల్ పోస్టర్ ను సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శులు పాలడుగు భాస్కర్, ఆర్ వెంకట్రాములు, పైళ్ల ఆశయ్య, టీ.స్కైలాబ్ బాబు లు ఆవిష్కరిం చారు. అనంతరం వారు మాట్లాడుతూ కేవీపీఎస్ 28 ఏండ్ల ఉద్యమ ప్రస్థానంలో అట్టడుగు వర్గాలను ఐక్యం చేయడానికి అవిశ్రాంత కృషి చేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం, కులాంతర వివాహాల ప్రోత్సాహకాలు, దళితులకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిందని తెలిపారు. రాష్ట్రంలో దళితుల పై ఏ మూలన ఏ సంఘటన జరిగినా కేవీపీఎస్ బాధితుల పక్షాన బాధ్యతాయుతంగా పని చేస్తుందని చెప్పారు. 80 ఏండ్ల స్వాతంత్రం తర్వాత కూడా దళితులు దాడులు దౌర్జన్యాలు ఎదుర్కోవటం అంటే దేశం ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవాలని కోరారు. సమానత్వం సాధించడానికి కుల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయడం ద్వారా మాత్రమే సామాజిక న్యాయం సిద్ధిస్తుందని తెలిపారు. కేవీపీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవాలు అక్టోబర్ 2న జిల్లా కేంద్రాల్లో, అక్టోబర్ 5 నుంచి 8 వరకు మండల, గ్రామ కేంద్రాల్లో కేవీపీఎస్ జెండాలు ఎగురవేయాలని పిలుపుని చ్చారు. ఆవిర్భావ వేడుకలను సాంస్కృతిక ఉత్సవంలాగా నిర్వహించాలని ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు.
అక్టోబర్ 2న చిక్కడపల్లి కేవీపీఎస్ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉదయం 8:30 గంటలకు కేవీపీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సామాజిక ఉద్యమ శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు వంగూరు రాములు, ఎస్వీ రమ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, కేవీపీఎస్ నగర కార్యదర్శి బిట్ర సుబ్బారావు, నాయకులు బి కర్రెప్ప భీమయ్య తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్ 2 నుంచి 8 వరకు కేవీపీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవాలు
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)