నవతెలంగాణ - హైదరాబాద్ : నేపాల్‌లో భారీ వర్షాలు, తుఫానుల కారణంగా నదులు ఉప్పొంగి తీవ్ర వరదలు సంభవించాయి. ఈ జలప్రళయంలో ఇప్పటివరకు కనీసం 19 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో గ్రామాలు, రహదారులు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించగా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
నేపాల్‌లో భారీ వర్షాలు..19 మంది మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)