Magazines

మణికొండలో చెడ్డీ గ్యాంగ్‌ కలకలం..

1 గంట క్రితం

cheddi gang
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్ మణికొండలోని నెక్నాంపూర్‌ ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్‌ కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్‌లోకి ఆరుగురు అనుమానితులు చొరబడినట్లు పోలీసులు గుర్తించారు. చెరువు వైపు ఉన్న ఫెన్సింగ్‌ను కత్తిరించి అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన వారు సీ బ్లాక్‌ మెట్ల మార్గం ద్వారా ఓ ఫ్లాట్‌లోకి వెళ్లి విలువైన వస్తువులను అపహరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించిన అపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ మహిళ వారిని ప్రశ్నించగా.. ఆమెపై దురుసుగా ప్రవర్తించి ఆయుధాలతో దాడికి యత్నించినట్లు సమాచారం. దీంతో అపార్ట్‌మెంట్‌ వాసులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అనుమానితుల కదలికలను గుర్తించి వారిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్