నవతెలంగాణ - హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 41 బార్ల ఏర్పాటుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. క్యూర్ పరిధిలో 14, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 27 బార్లకు దరఖాస్తులు ఆహ్వానించింది. రూ.లక్ష దరఖాస్తు రుసుముతో ఈ నెల 28 నుంచి అక్టోబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. క్యూర్, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, గ్రామాల విలీనం కారణంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా ఈ బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించినట్లు ఎక్సైజ్‌శాఖ తెలిపింది. ప్రాంతాన్ని బట్టి ఒక్కో బార్‌కు ఏడాదికి రూ.30 లక్షల నుంచి రూ.44 లక్షల వరకు ఎక్సైజ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
రాష్ట్రంలో కొత్తగా 41 బార్లు..నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)