నవతెలంగాణ - హైదరాబాద్ : గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని బోరవెల్లి వద్ద ఓ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. సోమవారం తెల్లవారుజామున వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 37 మంది విద్యార్థులు ఉన్నారు. ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వీరంతా తమిళనాడులో సేలంలోని హోలీక్రాస్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు. యాత్ర కోసం రాగా ఈ ప్రమాదం జరిగింది. అనంతరం విద్యార్థులను ఆర్టీసీ బస్సులో కర్నూలు వైపు తరలించారు.
విద్యార్థులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు బోల్తా
49 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)