నవతెలంగాణ - హైదరాబాద్ : గణేశ్ నిమజ్జన వేడుకలు ముగిసిన కొద్దిసేపటికే ముంబయిలో విషాదం చోటుచేసుకుంది. గోరేగావ్ తూర్పు రామమందిర్ రైల్వే స్టేషన్ సమీపంలోని పబ్లిక్ టాయిలెట్లో విషవాయువు పీల్చి ఇద్దరు యువకులు మృతిచెందారు. మృతులను ప్రభాకర్ ధనివర్ (24), భావిక్ దేశాయ్ (18)గా గుర్తించారు. నిమజ్జనం అనంతరం టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరూ అరగంటైనా తిరిగి రాకపోవడంతో సహచరులు అక్కడికి వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో కనిపించారు. తీవ్ర రసాయన దుర్వాసన రావడంతో పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. టాయిలెట్ సమీపంలోని పరిశ్రమ నుంచి రసాయన వ్యర్థాలు డ్రైనేజీలోకి చేరడం వల్ల విషవాయువు ఏర్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
విషవాయువు పీల్చి ఇద్దరు యువకుల మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)