Magazines

ఊకల్‌ సొసైటీలో 44వ మహాజన సభ

1 గంట క్రితం

Mahajana Sabha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ–గీసుకొండ

ఊకల్‌ ప్రాథమిక సహకార పరపతి సంఘం (పీఏసీఎస్‌) ఆధ్వర్యంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా ది ఊకల్‌ రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్‌ 44వ మహాజన సభ ఆదివారం నిర్వహించారు. సొసైటీ చైర్మన్‌ బొమ్మల రమేష్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతులు, ఖాతాదారులు పలు సమస్యలను ప్రస్తావించారు. సీఈఓ రాంబాబు మాట్లాడుతూ... రైతులకు వ్యవసాయ రుణాలను విరివిగా అందిస్తున్నట్లు తెలిపారు. 2025లో 131 మంది సభ్యులు సభ్యత్వం విరమించుకోగా, 79 మంది కొత్తగా సభ్యులుగా చేరారని చెప్పారు. 2026 మార్చి 31 నాటికి సంఘంలో 6,303 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో రూ.18,33,285 వాపసు చేసినట్లు, సంఘంలో రూ.3,41,90,614 వాటాధనం ఉన్నట్లు వివరించారు.

అధిక వడ్డీపై రైతుల అభ్యంతరం

సమావేశంలో పలువురు రైతులు రుణాలపై వడ్డీ రేట్లు ఇతర బ్యాంకులతో పోలిస్తే అధికంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని కోరారు. అలాగే రైతు రుణమాఫీ విషయంలో తమకు అన్యాయం జరిగిందని, అధికారుల తప్పిదాల కారణంగా కొందరికి రుణమాఫీ వర్తించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
“సొసైటీలో వడ్డీ భారం తగ్గించాలి”

బోయపాటి నరసింహారావు, రైతు–అనంతారం నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 1987 సంవత్సరం నుంచి ఊకల్‌ సొసైటీలో సభ్యుడిగా ఉన్నాను. రైతులకు అందుబాటులో ఉండాల్సిన సహకార సంఘాల్లో రుణాలపై వడ్డీ భారం తగ్గించాలని కోరుతున్నాను. ప్రైవేట్‌ బ్యాంకుల్లో లక్ష రూపాయల రుణానికి సుమారు రూ.7 వేల వరకు వడ్డీ పడుతోందని, కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించే పరిస్థితి ఉందని తెలిపారు. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందించి, ఆర్థికంగా అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్‌ డైరెక్టర్‌ శివ, డైరెక్టర్లు జనార్దన్‌రెడ్డి, వీరస్వామి, రాజ్‌కుమార్‌, వెంకట్రావు, చల్లా కృష్ణారెడ్డి, నిమ్మ, శ్రీనివాస్‌, రజిత, లక్ష్మి, పాపయ్య, రవి, అకౌంటెంట్‌ ఏ.రాంబాబు, సూపర్‌వైజర్‌ సాంబశివరావు, ఫీల్డ్‌ కలెక్షన్‌ అసిస్టెంట్‌ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్