నవతెలంగాణ - హైదరాబాద్: సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. మచ్చబొల్లారం గోపాల్‌నగర్‌లోని పెద్ది ఫార్మారెడ్డి కాలనీలో శ్రీనివాస్, రమాదేవి దంపతులు నివాసముంటున్నారు. శ్రీనివాస్ వ్యాపారంలో నష్టపోవడంతో కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి మరోసారి గొడవ జరగడంతో ఆవేశానికి గురైన రమాదేవి గొడ్డలితో భర్తపై దాడి చేసింది. తీవ్ర గాయాలైన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






కామెంట్‌లు (0)