నవతెలంగాణ - హైదరాబాద్ : అస్సాంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ సహ-వ్యవస్థాపకుడు అశుతోష్ రంకా సహా సుమారు 40 మంది వాలంటీర్లను ఆదివారం గువాహటిలో అస్సాం పోలీసులు నిర్బంధించారు. వాలంటీర్ల సమావేశానికి ముందే ఈ ఘటన జరగడం గమనార్హం. కొన్ని గంటల తర్వాత విడుదలైన అనంతరం రంకా.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు సవాల్ విసిరారు. "అస్సాంలో కాక్రోచ్‌ల పోరాటం ఇప్పుడే మొదలైంది" అని వ్యాఖ్యానించారు.
సీఎం హిమంతకు సవాల్ విసిరిన రంకా
57 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)