Magazines

కోహ్లి, గిల్‌ సెంచరీలు

2 గంటల క్రితం

Kohli, Gill score centuries
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

తొలి వన్డేలో భారత్‌ ఘన విజయం
వెస్టిండీస్‌ 295/7, భారత్‌ 300/2
నవతెలంగాణ-తిరునంతపురం : ‌ విరాట్‌ ‌కోహ్లి (139 నాటౌట్‌, 88 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్స్‌‌లు), శుభ్‌‌మన్‌ ‌గిల్‌ (110, 108 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) శతకాల మోత మోగించటంతో వెస్టిండీస్‌‌తో తొలి వన్డేలో భారత్‌ ‌ఘన విజయం సాధించింది. 296 పరుగుల లక్ష్యాన్ని 41.4 ఓవర్లోనే ఊదేసిన భారత్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ ‌చేసిన వెస్టిండీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 295 పరుగులు చేసింది. ఓపెనర్‌ ‌జస్టిన్‌ ‌గ్రీవ్స్‌ (101, 108 బంతుల్లో 12 ఫోర్లు) సెంచరీతో మెరువగా, మరో ఓపెనర్‌ ‌జాన్‌‌ కాంప్‌‌బెల్‌ (62, 60 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌‌లు) అర్థ సెంచరీతో మెరిశాడు. ఓపెనర్లు రాణించినా.. భారత బౌలర్లు కుల్‌‌దీప్‌ ‌యాదవ్‌(4/40), ప్రసిద్‌ ‌కృష్ణ (2/60) మిడిల్‌ ఆర్డర్‌‌ను కట్టడి చేశారు. భారత్‌, వెస్టిండీస్‌ ‌రెండో వన్డే బుధవారం గువహటిలో జరుగనుంది. ​ఛేదనలో శతక నాదం ఛేదనలో భారత్‌ ‌చెలరేగింది. కెప్టెన్‌ శుభ్‌‌మన్‌ ‌గిల్‌ (110), విరాట్‌ ‌కోహ్లి (139 నాటౌట్‌) సెంచరీలతో కదం తొక్కారు. రోహిత్‌ ‌శర్మ (32) రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో దూకుడుగా మొదలెట్టినా.. అతడు వికెట్‌ ‌కాపాడుకోలేదు. కోహ్లి, గిల్‌ ‌జోడీ రెండో వికెట్‌‌కు 151 పరుగుల భాగస్వామ్యం జోడించారు. శుభ్‌‌మన్‌ ‌గిల్‌ ‌కెరీర్‌ ‌పదో సెంచరీ సెంచరీగా.. విరాట్‌ ‌కోహ్లీ వన్డేల్లో 55వ శతకం సాధించాడు. దూకుడుగా ఆడిన కోహ్లి 40 బంతుల్లో ఫిఫ్టీ.. 74 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. గిల్ అవుటైనా రుతురాజ్‌ ‌గైక్వాడ్‌(13 ‌నాటౌట్‌) తోడుగా లాంఛనం ముగించాడు. మరో 50 బంతులు ఉండగానే భారత్‌ 300 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్