Magazines

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించాలి

1 గంట క్రితం

CEC Gyanesh Kumar must be removed immediately.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం. వెంకటేష్
నవతెలంగాణ-ముషీరాబాద్
రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం. వెంకటేష్ డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ముషీరాబాద్ గోల్కొండ చౌరస్తాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం స్వతంత్రత, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందని అన్నారు. అయితే పది నెలల్లో సహాయ ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పలుమార్లు విభేదించినప్పటికీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ఆందోళనకరమని తెలిపారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌) ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తొలగించబడిన ఓటర్ల హక్కులను పునరుద్ధరించడంతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు ఫామ్-6 విధానాన్ని గతంలో మాదిరిగానే కొనసాగించాలని కోరారు. ఓటర్ల డేటాను కేంద్రీకరించే చర్యలను నిలిపివేసి, స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు (ఈఆర్‌ఓ) అవసరమైన యాక్సెస్ కల్పించాలని అన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకంలో గతంలో ఉన్న విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగేలా పారదర్శకత, జవాబుదారీతనం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శివర్గ సభ్యు‌లు ఎం. శ్రీనివాసరావు, కె.ఎన్. రాజన్న, ఎం. దశరథ్, కె. నాగలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు ఆర్. వెంకటేష్, జె. కుమారస్వామి, సి. మల్లేష్, జి. నరేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్