తాజాగా యుఎల్సీపై స్పష్టమైన ఉత్తర్వులు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యుఎల్సీ) దరఖాస్తుల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం 2016లోనే యుఎల్సీ కింద పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు జీవో జారీ చేసినప్పటికీ, దానిని అమలు చేయకపోవడంతో వేలాది దరఖాస్తులు ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోయాయని తెలిపారు. ఫలితంగా ప్రజలు తమ భూములపై హక్కులు, లావాదేవీల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పానికి అనుగుణంగా సహచర క్యాబినెట్ మంత్రులతో చర్చించి 22ఏ సమస్యలకు ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించే దిశగా ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
యుఎల్సీ పెండింగ్ దరఖాస్తులపై తాజా నిర్ణయం
తెలంగాణ పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం (యుఎల్సీ) కింద పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, అర్హత ఉన్న కేసులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 455, 456, 747, 92 కింద వచ్చిన పెండింగ్ యుఎల్సీ దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించే విధంగా ఆదివారం మెమో జారీ చేసినట్టు చెప్పారు.
యూఎల్సీ దరఖాస్తులకు మోక్షం
46 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)