Magazines

రుద్రాక్షపల్లిలో అభివృద్ధి పనుల ప్రారంభం

50 నిమిషాల క్రితం

Development
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 2 నిమిషాల చదవడం

- కోట్లాది రూపాయల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్

నవతెలంగాణ-సత్తుపల్లి

 రుద్రాక్షపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో గురువారం ఉత్సాహంగా జరిగాయి.  ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొని, పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ​ఈ సందర్బంగా ఎమ్మెల్యే రూ.1.50 కోట్ల వ్యయంతో పూర్తయిన 28 సీసీ రోడ్లను ప్రారంభించారు. రుద్రాక్షపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెం, బాసారం, తోగ్గుడెం, రంగాపురం, సత్యంపేట గ్రామాల్లో నిర్మించిన ఈ రోడ్లు ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా మారనున్నాయి. దీనితో పాటు అర్హులైన లబ్ధిదారులకు 1,200 స్మార్ట్ రేషన్ కార్డులను ఆమె పంపిణీ చేశారు.


అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... రుద్రాక్షపల్లి గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రూ. 4 కోట్లతో సత్తెమ్మ గుడి రోడ్డు నిర్మాణం మహిళల సాధికారత కోసం స్త్రీ శక్తి భవనాలు రక్షిత మంచి నీటి కోసం ఆర్వో వాటర్ ప్లాంట్తా గునీటి సరఫరాకు సోలార్ మోటార్లు, రాత్రివేళ వెలుగుల కోసం సోలార్ విద్యుత్ దీపాలు ఇందిరమ్మ పథకం మొదటి విడత కింద 42 గృహాల మంజూరు ​గ్రామ భద్రత, సాంకేతిక అభివృద్ధిలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలను, సమాచార మార్పిడి కోసం అమర్చిన టీవీని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ప్రారంభించారు.


అంతేకాకుండా, రుద్రాక్షపల్లి వైకుంఠధామంలో అంతిమ సంస్కారాలు, దహన కార్యక్రమాల కోసం ఉచితంగా కట్టెలు సరఫరా చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ఎం పీడీవో రావెళ్ల చిన్న నాగేశ్వరరావు రుద్రాక్షపల్లి గ్రామ సర్పంచ్ పాయం నాగేంద్ర బాబు, ఉపసర్పంచ్ భూపతి రెడ్డి, సత్తుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు దామోదరరావు, నాయకులు బత్తుల భరత్ కుమార్, హలావత్ అర్జున్, పిన్నమనేని, వసంతరావు, సారా రవి, సోయం సత్యం, తాటి నాగేష్ వార్డు భ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్