నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మదర్ థెరెసా (మిస్ట్) ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) విభాగాధిపతి (హెచ్‌ఓడీ) పిన్నబోయిన మారేశ్వరరావు రాయలసీమ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టా పొందారు. సత్తుపల్లి మండలం రామానగరం గ్రామానికి చెందిన పిన్నబోయిన భూషయ్య, మంగమ్మ దంపతుల కుమారుడైన మారేశ్వరరావు, డాక్టర్ కుర్ర రాజశేఖరరావు పర్యవేక్షణలో పరిశోధనలు పూర్తి చేశారు. సోషల్ నెట్‌వర్క్‌లలో సమాచార భద్రత, ప్రైవసీకి సంబంధించి ఇంప్రూవ్డ్ అండ్ ఎన్‌హాన్స్డ్ సెక్యూరిటీ అప్రోచెస్ టు ఇంప్రూవ్ ప్రైవసీ ఎన్‌హాన్సింగ్ అండ్ మల్టీ యాక్సెస్ కంట్రోల్ పాలసీస్ ఇన్ సోషల్ నెట్‌వర్క్ అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు గాను విశ్వవిద్యాలయం ఈ డాక్టరేట్‌ను ఖరారు చేసింది.
మారేశ్వరరావు తన ప్రాథమిక విద్యను రామానగరం ప్రభుత్వ పాఠశాలలో, ఉన్నత విద్యను నాచారంలో పూర్తి చేశారు. అనంతరం కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ, వరంగల్ నిట్ (నిట్)లో పీజీ, రాయలసీమ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. గత రెండు దశాబ్దాలుగా మదర్ థెరెసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్న ఆయన డాక్టరేట్ సాధించడం పట్ల కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ చలసాని హరికృష్ణ, ప్రెసిడెంట్ చలసాని సాంబశివరావు, వైస్ ప్రెసిడెంట్ కొత్తూరి ప్రభాకరరావు, జాయింట్ సెక్రెటరీ డాక్టర్ కందిమళ్ల కృష్ణారావు, డైరెక్టర్లు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మారేశ్వరరావుకు అభినందనలు తెలిపారు.







కామెంట్‌లు (0)