Magazines

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈవోగా అనుప్ బగ్చీ

1 గంట క్రితం

CEO of HDFC Bank
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీకి నూతన సారథి రానున్నారు. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా అనుప్ బగ్చీని నియమిస్తున్నట్లు బ్యాంక్ బోర్డు ప్రకటించింది. ప్రస్తుత ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

అనుప్ బగ్చీ నియామకంతో పాటు ఆయన వేతన ప్యాకేజీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అక్టోబర్ 1న ఆమోదం తెలిపింది. ఆయన 2026 అక్టోబర్ 27 నుంచి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. బగ్చీ పదవీకాలం 2029 అక్టోబర్ 26న ముగుస్తుంది. ప్రస్తుత సీఈవో శశిధర్ జగదీశన్ పదవీకాలం 2026 అక్టోబర్ 26తో ముగియనున్న నేపథ్యంలో ఈ నియామకం ఖరారైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్