Magazines

విహారయాత్రలో తీవ్ర విషాదం

1 గంట క్రితం

terrible
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

సముద్ర అలల ధాటికి 8 మంది మృతి
నవతెలంగాణ - హైదరాబాద్‌: మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పుణే నుంచి విహారయాత్ర కోసం వచ్చిన విద్యార్థుల్లో ఎనిమిది మంది సముద్రపు అలల ప్రవాహానికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. తీరానికి కొట్టుకొచ్చిన విద్యార్థులను బ్రతికించేందుకు స్థానికులు, సహాయక సిబ్బంది సిపిఆర్ అందిస్తూ.. కాళ్లు చేతులు రుద్దుతూ వారిలో చలనం తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించారు. మరోవైపు బాధితుల ఆర్తనాదాలతో బీచ్ ప్రాంగణమంతా శోకసంద్రంగా మారింది.


దిఘీ కోస్టల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దివేఆగర్ బీచ్‌కు పుణే జిల్లా అలంకార్‌లోని విన్నర్స్ అకాడమీ అనే ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి 25 మంది బాలురు, 17 మంది బాలికలు, 6 గురు ఉపాధ్యాయులతో కూడిన 48 మంది బృందం పిక్నిక్ కోసం వచ్చింది. వీరిలో 11, 12 తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు సముద్రంలోకి దిగారు. నీటి లోతును, ప్రవాహ తీవ్రతను అంచనా వేయలేకపోవడంతో ఒక్కసారిగా వచ్చిన బలమైన అలల ధాటికి కొట్టుకుపోయారని పోలీస్ అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్